VIDEO: అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. ఒకరికి గాయాలు.!
KDP: బీ.కోడూరు(M) పెదుళ్లపల్లె గ్రామంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ దాడికి దారితీసింది. స్థానికుల వివరాల మేరకు.. అన్న సుబ్రహ్మణ్యం, తమ్ముడు నాగసుబ్బయ్య గ్రామంలోని పొలం వద్ద ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో తమ్ముడికి తీవ్ర గాయాలు కాగా, 108లో బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు రెఫర్ చేశారు.