పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి: CI

పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి: CI

ప్రకాశం: పరీక్షలు ముగిసి వేసవి సెలవులు ప్రారంభమవుతున్న తరుణంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని పొదిలి CI రాజేష్ కుమార్ సూచించారు. చెరువులు, కాలువలు, బావుల వద్దకు చిన్నారులను ఒంటరిగా పంపకూడదని, కేవలం ఈత తెలిసిన వారి పర్యవేక్షణలోనే అనుమతించాలని కోరారు. ఇటీవల ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నట్లు గుర్తు చేశారు.