బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
ADB: ఇచ్చోడ మండలంలోని తలమద్రి గ్రామంలో మాజీ ఎంపీ సోయం బాపూరావు, DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ సోమవారం పర్యటించారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆక్కేపల్లి లక్ష్మణ్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి, ధైర్యంగా ఉండమని భరోసా కల్పించారు.