గ్రానైట్ లారీలను పట్టుకున్న అధికారులు

PLD: ప్రకాశం జిల్లా నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న 8 గ్రానైట్ లారీలను కమర్షియల్ టాక్స్ అధికారులు సోమవారం కారంపూడి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మాచర్ల-నరసరావుపేట రహదారిలో ఈ లారీలను అదుపులోకి తీసుకున్నారు. అయితే, తమ వద్ద అన్ని బిల్లులు ఉన్నాయని లారీ డ్రైవర్లు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.