ట్రంప్‌కు వ్యతిరేకంగా భారత సంతతి అటార్నీ

ట్రంప్‌కు వ్యతిరేకంగా భారత సంతతి అటార్నీ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య యుద్ధం, టారిఫ్‌ల అధికారాలపై US సుప్రీంకోర్టు అత్యంత కీలక విచారణకు సిద్ధమవుతోంది. ఈ కేసులో ట్రంప్‌నకు వ్యతిరేకంగా భారత సంతతి అటార్నీ నీల్ కత్యాల్ వాదనలు వినిపించనున్నారు. 54 ఏళ్ల నీల్ షికాగోలో జన్మించారు. ఆయన ఒబామా హయాంలో US సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 50కి పైగా కేసులు వాదించిన ఆయన పేరు అంతర్జాతీయంగా మార్మోగుతోంది.