ప్రజల క్షేమం కోసం రోడ్డు బ్లాక్: పోలీసులు
NGKL: ఊరుకొండ మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు బొమ్మరాజుపల్లి, రామిరెడ్డిపల్లి చెరువులు అలుగులు పారుతున్నాయి. దీంతో సుమారు 10 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ప్రజల క్షేమం కోసం ఎస్సై కృష్ణదేవ వెంటనే స్పందించి, తన సిబ్బందితో కలిసి ముందస్తు జాగ్రత్తగా రెండు వైపులా రోడ్డును బ్లాక్ చేశారు.