జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

ప్రకాశం: జిల్లా ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద సోమవారం ఈగల్ టీం నిర్వహించిన తనిఖీల్లో 15 కేజీల గంజాయి, రూ. 75వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జరిగిన ఈ తనిఖీల్లో, పూరీ - తిరుపతి ఎక్స్‌ప్రెస్ పోలీస్ జాగిలం రాక్సీ సహాయంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక్కరిని అదుపులోకి తీసుకోన్నామని పోలీసులు తెలిపారు.