మండల విభజనతో అభివృద్ధికి బాటలు: మాజీ కౌన్సిలర్

మండల విభజనతో అభివృద్ధికి బాటలు: మాజీ కౌన్సిలర్

KRNL: ఆదోని మండలంలో గతంలో 42 గ్రామాలు ఉండేవని, ఎమ్మెల్యే డాక్టర్ పీవీ పార్థసారథి కృషితో ఆదోని మండలం–1, ఆదోని మండలం–2గా విభజిస్తూ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం శుభపరిణామమని మాజీ కౌన్సిలర్ మధుసూదన శర్మ సోమవారం తెలిపారు. ఈ నిర్ణయంతో 42 గ్రామాలు ఇకపై రెండు మండలాల పరిధిలోకి వెళ్లనున్నాయని, దీనివల్ల పరిపాలన మరింత సులభతరం అవుతుందని ఆయన పేర్కొన్నారు.