పల్లాతో భేటీ పార్టీ బలోపేతంపై చర్చ
KRNL: ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఇవాళ విజయవాడలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ సమస్యలు, పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన చర్యలు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల అంశాలపై ఆయనతో చర్చించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె కుమారుడు, నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.