ప్రతి రైతు సంప్రదాయ పంటలు ప్రయత్నించాలి: కలెక్టర్

BDK: ములకలపల్లి మండలం మూకమామిడి గ్రామపంచాయతీలోని గట్టగూడెం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వెదురు సాగును జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం సందర్శించారు. ప్రతి రైతు సాంప్రదాయ పంటలతో పాటు కొత్త పంటలను ప్రయత్నించాలని కలెక్టర్ సూచించారు. అంతర పంటల సాగు ద్వారా తక్కువ భూమిలో ఎక్కువ లాభాలు పొందవచ్చని అన్నారు.