చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీమ్
బంగ్లాదేశ్ సీనియర్ ప్లేయర్ ముష్ఫికర్ రహీమ్ టెస్టుల్లో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. బంగ్లా తరఫున 100వ టెస్టు ఆడుతున్న తొలి ప్లేయర్‌గా నిలిచాడు. ఐర్లాండ్‌తో 2వ టెస్టులో ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు రహీమ్ 12 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలతో మొత్తం 6351 రన్స్ చేశాడు. అతని హైస్కోర్ 219*. రహీమ్ తర్వాత మోమినుల్ హక్(75) రెండో స్థానంలో ఉన్నాడు.