నిలిచిపోయిన బస్సు.. ప్రయాణికుల ఇబ్బందులు

నిలిచిపోయిన బస్సు.. ప్రయాణికుల ఇబ్బందులు

బాపట్ల జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సుమారు 5 గంటలపాటు నిలిచిపోయిన ఘటన శనివారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. వీ కావేరి బస్సు తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళుతుండగా సంతమాగులూరులోని ఏల్చూరు వద్ద సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డట్లు పేర్కొన్నారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని ప్రయాణికులను వేరే బస్సులో పంపించారు.