సమయానికి.. MMTS సర్వీసులు
HYDలోని లింగంపల్లి సహా అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్న MMTS రైల్వే సర్వీసులు సమయానికి అందుబాటులో ఉంటున్నాయని SCR రైల్వే అధికారులు తెలియజేశారు. 96% సమయపాలన పాటిస్తున్నట్లుగా రికార్డులో తెలిసిందని తెలిపారు. ఎప్పటికప్పుడు రికార్డులను పరిశీలిస్తూనే, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నట్లు వివరించారు.