రూ.8 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం

రూ.8 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం

NGKL: వెల్దండ మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. సర్పంచ్ మట్ట యాదమ్మ రూ.8 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసి ప్రారంభించారు. నాణ్యతతో కూడిన పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శీను, వార్డు సభ్యులు, పాల్గొన్నారు.