VIDEO: జంగారెడ్డిగూడెంలో వ్యక్తిపై హత్యాయత్నం
ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో ఒక వ్యక్తిపై శనివారం తెల్లవారుజామున హత్యాయత్నం జరిగింది. ఒక నివాసానికి వాచ్మెన్ గా పనిచేస్తున్న బలగం అప్పారావు అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సమాచారం అందుకున్న స్థానికులు వాచ్మెన్ బంధువులకు సమాచారం అందించగా చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేపట్టారు.