ఇరిగేషన్ పనుల పురోగతిపై మంత్రి ఆదేశాలు

ఇరిగేషన్ పనుల పురోగతిపై మంత్రి ఆదేశాలు

SRD: సింగూర్ ప్రాజెక్టు డ్యామ్ సేఫ్టీ పనులను మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు. సింగూరు కాల్వకట్ట బలోపేతం పనులు, జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్షించారు. రానున్న 50 ఏళ్లు సింగూరు ప్రాజెక్టు డ్యాం నిలిచేలా నిర్మాణ పనులను చేపట్టాలని మంత్రి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టులో ఉన్న ఐలాండ్ అభివృద్ధిపై టూరిజం అధికారులతో చర్చించారు.