పూర్తిస్థాయిలో సురక్షిత తాగునీటి సరఫరా కల్పిస్తాం: ఎమ్మెల్యే

KKD: కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని తూరంగి తప్ప మిగిలిన అన్ని గ్రామాలకు 15 రోజుల్లో పూర్తిస్థాయిలో సురక్షిత తాగునీటి సరఫరా కల్పిస్తామని ఎమ్మెల్యే నానాజీ హామీ ఇచ్చారు. మంగళవారం పండూరులోని మంచినీటి చెరువు, వాటర్ పంపింగ్ పథకాన్ని పరిశీలించిన ఆయన, అధికారులకు తగిన సూచనలు చేశారు. తాగునీటి ఎద్దడి ఎక్కడా తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.