గుంటూరులో 3 రోజులు నీటి సరఫరా బంద్
GNTR: గుంటూరులో ఈనెల 31, సెప్టెంబర్ 1, 2వ తేదీల్లో పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు శుక్రవారం కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. నెహ్రూనగర్ వద్ద పైప్‌లైన్, సంజీవయ్యనగర్‌లో ఇంటర్‌నెట్ కనెక్షన్ పనులు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. స్తంభాలగరువు, గుజ్జనగుండ్ల, ఏటీ అగ్రహారం, వికాస్‌నగర్, శ్యామలానగర్, హనుమయ్యనగర్‌లలో సరఫరా ఉండదన్నారు.