భద్రత ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
ELR: ద్వారకాతిరుమల మండలం ఐ.ఎస్.జగన్నాథపురం గ్రామాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు సందర్శించనున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆదివారం పరిశీలించారు. కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే రాకపోకలు, ప్రజా నిర్వహణ తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.