ఒంటిమిట్ట రామయ్య హుండీ ఆదాయం రూ.10 లక్షలు

ఒంటిమిట్ట రామయ్య హుండీ ఆదాయం రూ.10 లక్షలు

KDP: ఆంధ్ర భద్రాద్రిగా విరాజుల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి హుండీ ఆదాయాన్ని సోమవారం ఆలయ టీటీడీ అధికారులు లెక్కించారు. జూలై 18 నుంచి ఆగస్టు 18 వరకు స్వామి వారి దర్శనార్థం వచ్చి తమ కోర్కెలు తీర్చాలంటూ స్వామివారి హుండీలో భక్తులు వేసిన కానుకలను లెక్కించినట్లు అధికారులు తెలిపారు. రూ.10,23,681 వచ్చినట్లు ఆలయ టీటీడీ అధికారులు పేర్కొన్నారు.