నిద్రకు ముందు పుస్తకాలు చదివితే ప్రయోజనాలివే!

నిద్రకు ముందు పుస్తకాలు చదివితే ప్రయోజనాలివే!

పడుకునే ముందు పుస్తకాలు చదవడం అనేది నిద్ర నాణ్యతను పెంచే మంచి అలవాటు. దీనివల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. పుస్తకాలు చదవడం వలన మెదడు శాంతించి, త్వరగా నిద్రలోకి జారుకోవడానికి తోడ్పడుతుంది. స్మార్ట్‌ఫోన్‌ల బ్లూలైట్‌కు దూరంగా ఉండటం వలన నిద్ర హార్మోన్(మెలటోనిన్) ఉత్పత్తికి ఆటంకం కలగదు. పుస్తకాలు చదివితే ఏకాగ్రత కూడా పెరుగుతుంది.