మోదీపై దూషణలు.. పోలీసుల అదుపులో యువకుడు

మోదీపై దూషణలు.. పోలీసుల అదుపులో యువకుడు

అన్నమయ్య: రాయచోటి సరస్వతీనగర్‌కు చెందిన రియాన్ (24) ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దూషణలతో సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టడంతో పోలీసులు ఆదివారం రాత్రి అతడిని అదుపులోకి తీసుకున్నారు. వీడియో వైరల్ కావడంతో రాయచోటి పోలీసులు విచారణ చేపట్టారు. భారతదేశంపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.