కలెక్టర్‌ను కలిసిన నూతన ఆర్‌డీవో
KMR: కామారెడ్డి కొత్త రెవెన్యూ డివిజనల్ అధికారిగా NY. గిరి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఇక్కడ ఆర్‌డీవోగా విధులు నిర్వర్తించిన వీణా, దేవాదాయ శాఖ ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా డిప్యుటేషన్‌పై బదిలీ అయ్యారు.