ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గ ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర ప్రజావేదికలో బుధవారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. 2007 నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, గత ప్రభుత్వం ఆపేసిన బీటీపీ పనులను పూర్తి చేసి 143 చెరువులకు కృష్ణా జలాలు అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేరాఫ్ అడ్డాగా మారుస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.