ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
KMR: భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మార్వో సునీత, ఎంఈవో రాజా గంగారెడ్డి మాట్లాడుతూ.. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విద్యార్థులకు బహుమతులు అందజేశారు.