అధికారులను అప్రమత్తం చేసిన సీఎం

HYD: భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పాత ఇళ్లలో ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. వినాయక మండపాల వద్ద భక్తులు ప్రమాదబారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నగరంలో హైడ్రా, GHMC, NDRF, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సమన్వయంగా పనిచేయాలని సూచించారు.