VIRAL: ఆకాశంలో వేలాది కాకుల గుంపు
ఇరాన్‌తో ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ ఆకాశంలో వేలాది కాకులు గుంపులుగా చేరిన వీడియో SMలో వైరల్ అవుతోంది. ఇది ఏదో వినాశనానికి సంకేతమని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, శాస్త్రవేత్తలు దీన్ని కొట్టిపారేశారు. ఏటా వలసల సమయంలో దాదాపు 50 కోట్ల పక్షులు ఇజ్రాయెల్ మీదుగా ప్రయాణిస్తాయని, గూడు కట్టుకునే క్రమంలో 'హుడెడ్' కాకులు గుంపులుగా కనిపిస్తాయని వివరించారు.