రేపు మంత్రుల పర్యటన బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రాల్లో శనివారం మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీహరి పర్యటించనున్నారు. 170 కోట్ల రూపాయల వ్యయంతో బస్టాండ్, 50 పడకల ఆసుపత్రి, పాలిటెక్నిక్ కళాశాల భవన సముదాయాలు తదితర నిర్మాణ పనుల శంకుస్థాపన జరగనుంది. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ శుక్రవారం సిబ్బంది తో కలిసి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.