VIDEO: రైల్వేస్టేషన్‌లో తృటిలో తప్పిన ప్రమాదం

VIDEO: రైల్వేస్టేషన్‌లో తృటిలో తప్పిన ప్రమాదం

MHBD: కేసముద్రం రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద నుంచి పట్టాలు దాటేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఈ క్రమంలో రైలు కదలడంతో పట్టాల మధ్య ఇరుక్కున్నాడు. భయాందోళనకు గురై పట్టాల మధ్యలో పడుకున్నాడు. ఇది గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే పైలెట్‌కు సమాచారం ఇవ్వడంతో రైలును అపడంతో వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది.