పశువుల యజమానులకు పరిహారం చెల్లింపు

NGKL: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పులుల దాడిలో చనిపోయిన పశువుల యజమానులకు నష్టపరిహారాన్ని అధికారులు అందజేశారు. 2020–21లో 33 పశువులకు రూ.3.69 లక్షలు, 2022–23లో 85 పశువులకు రూ.11.75 లక్షలు, 2023–24లో 81 పశువులకు రూ.8.93 లక్షలు, 2024–25లో 58 పశువులకు రూ.5.51 లక్షలు, 2025–26లో 6 పశువులకు రూ.79 వేల పరిహారం చెల్లించామని FRO వీరేష్ తెలిపారు.