అచ్చంపేట పట్టణంలో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి
NGKL: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేశారని వెల్లడించారు.