ఉగ్రవాదుల కోడ్ వర్డ్స్‌గా బిర్యానీ, విందు
ఢిల్లీ బాంబు దాడి కోసం నలుగురు వైద్యులు ఆహార పదార్థాల పేర్లను కోడ్‌లుగా ఉపయోగించినట్లు విచారణలో గుర్తించారు. బిర్యానీ అంటే పేలుడు పదార్ధం, విందు అంటే దాడి అని తేలిందని అధికారులు తెలిపారు. ఈ వైద్యులు 'బిర్యానీ సిద్ధంగా ఉంది, విందుకు సిద్ధంగా ఉండండి' అని సందేశాలు పంపుకున్నట్లు చెప్పారు. కాగా ఇప్పటికే పట్టుబడిన డాక్టర్ల వైద్య లైసెన్స్‌లు రద్దు అయ్యాయి.