పద్మాక్షిదేవికి అభిషేకం, అలంకరణ

పద్మాక్షిదేవికి అభిషేకం, అలంకరణ

హనుమకొండ జిల్లా కేంద్రంలోని శ్రీ హనుమాన్ గిరి పద్మాక్షి దేవి ఆలయంలో శుక్రవారం వైశాఖ శుక్ల అష్టమి సందర్భంగా పద్మాక్షి దేవికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూజా కార్యక్రమాలు అనంతరం ఆలయాన్ని భక్తులు సందర్శించి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు, అర్చకులు ఏర్పాట్లు చేశారు.