ధర్మవరంలో వివాహిత ఆత్మహత్య

ధర్మవరంలో వివాహిత ఆత్మహత్య

సత్యసాయి: ధర్మవరం పట్టణం గాంధీనగర్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. లత (38) అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు గమనించి, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని ప్రాథమిక సమాచారం.