సౌతాఫ్రికా-'A' ఆలౌట్.. 34 రన్స్ లీడ్‌లో భారత్
భారత్-'A'తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా-'A' 221 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు కెప్టెన్ మార్క్వెస్ అకెర్‌మాన్ 134 పరుగుల భారీ శతకంతో రాణించగా, టెంబ బవుమా డకౌట్ అయ్యాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ 3 వికెట్లు తీయగా, ఆకాష్ దీప్, సిరాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 34 పరుగుల ఆధిక్యం లభించింది.