విద్యుత్ షాక్‌తో గొర్రెలు మృతి

ATP: బొమ్మనహాళ్ మండలంలోని ఉప్పరహల్ గ్రామానికి చెందిన సురేష్‌కు చెందిన నాలుగు గొర్రెలు విద్యుత్ షాక్‌తో బుధవారం మృతి చెందాయి. ఎల్బీనగర్ గ్రామం వద్ద మేత మేస్తూ ఉండగా విద్యుత్ స్తంభానికి ఉన్న ఎర్త్ వైర్లలో కరెంట్ ప్రవహించడం వల్ల తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి. అప్రమత్తమైన కాపరులు మిగతా గొర్రెలను కాపాడగలిగారు.