అసభ్యంగా ప్రవర్తించిన ఎస్సై.. ఎస్పీకి ఫిర్యాదు

అసభ్యంగా ప్రవర్తించిన ఎస్సై.. ఎస్పీకి ఫిర్యాదు

PLD: ఈపూరు మండలం ముప్పాళ్లకు చెందిన నాగజ్యోతి సోమవారం నరసరావుపేటలో ఎస్పీ బి. కృష్ణారావును కలిసి ఎస్సైపై ఫిర్యాదు చేశారు. పక్కింటి వారితో గోడ వివాదంపై స్టేషన్‌కు వెళ్తే, ఎస్సై తనను అసభ్యంగా దూషించారని ఆమె ఆరోపించారు. తమ ఫిర్యాదును పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని భర్తతో కలిసి ఆమె ఎస్పీని కోరారు.