VIDEO: 'రోడ్లకు మరమ్మత్తులు చేయండి'

ELR: చింతలపూడి-లింగపాలెం వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో దర్శనమిస్తుండడంతో నిత్యం నరకం అనుభవించవలసి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. అధికారులకు విన్నవించినప్పటికీ ఏ ఒక్కరూ పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గుంతలు లేని రోడ్లుగా రిపేరు చేస్తామన్న కూటమి పాలకులు ప్రచారానికే పరిమితమయ్యారని, ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.