ఉచిత బస్సులో ప్రయాణించిన భువనేశ్వరి
AP: సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో భాగంగా 'స్త్రీ శక్తి' ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని వినియోగించుకున్నారు. ఆధార్ కార్డు చూపించి, ఫ్రీ టికెట్ పొంది, శాంతిపురం నివాసం నుంచి తుమ్మిసి వరకూ బస్సులో ప్రయాణించారు. మహిళలతో మాట్లాడి ఉచిత బస్సు ప్రయాణం గురించి తెలుసుకున్నారు.