టమాటా రైతులకు కన్నీళ్లు.. టమోటాలను పారబోసి నిరసన

టమాటా రైతులకు కన్నీళ్లు.. టమోటాలను పారబోసి నిరసన

KRNL: పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో శనివారం టమాటాలు పారబోసి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లి తర్వాత పత్తికొండ, తుగ్గలి, దేవనకొండ, మద్దికేర మండలాల్లో విస్తారంగా టమాటా సాగవుతుంది. 25 కిలోల బాక్స్ రూ. 50–60 పలకడంతో రైతులు నష్టపోతున్నారు. ఎకరాకు రూ. 60 వేల పెట్టుబడి పెట్టినా నాణ్యత పేరుతో వ్యాపారులు నట్టేట ముంచుతున్నారని వాపోయారు.