సెట్స్‌కు సల్మాన్ ఫుడ్‌ ట్రక్కు.. క్లారిటీ

సెట్స్‌కు సల్మాన్ ఫుడ్‌ ట్రక్కు.. క్లారిటీ

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సెట్స్‌కు ఫుడ్ ట్రక్కు తెచ్చుకుంటాడనే వార్త బయటకొచ్చింది. దీనిపై కొరియోగ్రాఫర్లు పీయూష్ భగత్,  షాజియా సమ్‌జీ మాట్లాడారు. సల్మాన్ షూటింగ్‌లో పాల్గొనే ప్రతిచోటా బీయింగ్ హంగ్రీ అనే ట్రక్కు ఉంటుందని, దాని పూర్తి ఖర్చును ఆయనే భరిస్తాడని చెప్పారు. స్టార్ హీరోల వల్ల నిర్మాతలు నష్టపోతున్నారనే వార్తల్లో నిజం లేదన్నారు.