ఒకే ఊరు.. రెండు పంచాయతీలు
KMM: కూసుమంచి మండలం ఈశ్వరమాధారం పెద్ద గ్రామ పంచాయతీని గత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం మూడు కొత్త పంచాయతీలుగా ఈ శ్వరమాధారం, మంగలితండా, రాజుపేట బజారు విడదీసింది. అయితే, ఈ విభజనలో ఊరి మధ్యలో ఉన్న సీసీ రోడ్డునే సరిహద్దుగా నిర్ణయించారు. దీని కారణంగా ఇళ్లు పక్కపక్కనే ఉన్నా, నివాసితులు రెండు వేర్వేరు గ్రామ పంచాయతీల పరిధిలోకి వస్తున్నారు.