హంద్రీనీవా కాలువ పనులు పరిశీలన

CTR: పుంగనూరు సింగిరిగుంట పంచాయతీ పరిధిలో హంద్రీనీవా కాలువ పనులను టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్ర రెడ్డి ఆదివారం పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసేలా కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం త్వరలోనే కాలువలకు నీటిని విడుదల చేస్తుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.