కలెక్టర్‌కు ఎమ్మెల్యే వినతి

కలెక్టర్‌కు ఎమ్మెల్యే వినతి

మేడ్చల్ మల్కాజ్‌గిరి కలెక్టర్ మను చౌదరిని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలిశారు. మల్లాపూర్ సర్వే నెంబర్ 110లోని 300 గజాల ప్రభుత్వ స్థలంలో నవోదయ మహిళ మండలిని నిర్మించగా మిగిలిన ఖాళీ స్థలానికి ప్రహరీ గోడ నిర్మించామని, ఆ స్థలాన్ని కబ్జాకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. అనంతరం స్థలాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు.