హెల్మెట్లు కొనిపించిన పట్టణ సీఐ
ELR: నూజివీడు ప్రధాన రహదారులలో పోలీసులు బుధవారం విజిబుల్ పోలింగ్ నిర్వహించారు. హెల్మెట్ లేని ద్విచక్ర వాహన చోదకులను గమనించి జరిమానా విధించకుండా హెల్మెట్లు కొనుగోలు చేయించారు. పట్టణ సీఐ పీ. సత్య శ్రీనివాస్ మాట్లాడుతూ.. హెల్మెట్ జరిమానా విధించడం ఒక్కటే మార్గం కాదని, సురక్షితమైన ప్రయాణానికి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.