సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో బుధవారం మంత్రి స్వామి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న 47 మందికి రూ.55 లక్షలు విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 1687 మందికి రూ.13 కోట్లకు పైగా విలువైన చెక్కులు అందించనట్లు ఆయన వెల్లడించారు.