సింగూర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద.. ఒక గేటు ఎత్తివేత

SRD: పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. దీంతో ఒక గేటు ద్వారా 7085 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నట్లు AEE మహిపాల్ రెడ్డి శనివారం ఉదయం తెలిపారు. ఎగువ నుంచి 13,315 క్యూసెక్కులు వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీలకు ప్రస్తుతం 16.640 టీఎంసీలు నిల్వ ఉందని పేర్కొన్నారు.