బెంగాల్ ఎన్నికల వేళ బాంబుల కలకలం

బెంగాల్ ఎన్నికల వేళ బాంబుల కలకలం

అసెంబ్లీ ఎన్నికల ముందు పశ్చిమ బెంగాల్‌లో ఒక ఇంట్లో పెద్ద ఎత్తున బాంబులు దొరకడం కలకలం రేపింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఓ ఇంట్లో పోలీసులు భారీగా బాంబులను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు బాంబు తయారీకి ఉపయోగించే పదార్థాలను కూడా గుర్తించారు. ప్రస్తుత ఎన్నికల వేళ ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.