దుగ్గిరాలలో రోడ్డు ప్రమాదం.. ఆగిన ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్.!

దుగ్గిరాలలో రోడ్డు ప్రమాదం.. ఆగిన ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్.!

గుంటూరు: దుగ్గిరాలలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. తెనాలికి చెందిన నారేపాలెం నాగరాజు విజయవాడ కేశఖండన శాలలో పనిచేసేందుకు బైక్‌పై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మార్గమధ్యంలో టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ కాలికి గాయమైంది.