అవార్డు స్వీకరించిన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్
PDPL: పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ మంగళవారం హైదరాబాదులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. రాష్ట్రంలోనే ఉత్తమ సూపరింటెండెంట్, అనస్థీషియాలజిస్ట్, సివిల్ సర్జన్‌గా ఆయన అవార్డులకు ఎంపికయ్యారు. ఆరోగ్య శ్రీ కేసులు, రక్త పరీక్షలు నిర్వహించుటలో ఆసుపత్రి ప్రథమ స్థానంలో నిలిచింది.